Sad incident: సంగారెడ్డి జిల్లాలో హృదయ విదారకరమైన ఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం బ్యాంకులో చేసిన అప్పులు కట్టలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పటాన్ చెరు (మం) రుద్రారం గ్రామంలో శ్రీనివాస్, భార్యతో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే.. 6 నెలల క్రితం తన తల్లి చనిపోయింది. తనని అల్లారుముద్దుగా కంటి రెప్పలా చూసుకున్న తల్లి చనిపోవడంతో శ్రీనివాస్ కన్నీరుమున్నీరయ్యాడు. అయితే తన తల్లి అంత్యక్రియలు చేసేందుకు శ్రీనివాస్ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తన సంపాదనతోనే ఇంటిని నెట్టికొచ్చిన శ్రీనివాస్ కు అప్పటికప్పుడే భారీ మొత్తంలో డబ్బులు సేకరించేందుకు నానా కష్టాలు పడ్డాడు. తల్లి అంత్యక్రియలకు చివరకు బ్యాంక్ లో లోన్ తీసుకుందామని భావించిన శ్రీనివాస్ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి డబ్బులను తీసుకున్నాడు. అయితే తల్లి అంత్యక్రియలను భారీగానే చేశాడు.
Read also: Kerala: కేరళ హోటల్ యజమాని హత్య కేసులో ట్విస్ట్.. సెక్స్ స్కాండల్ కోణం..
తల్లిని మాత్రం ఏ మాత్రం కష్ట లేకుండా చూసుకున్న శ్రీనివాస్ తన తల్లి మరణంతో కుంగిపోయాడు. అయితే గత మూడు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో శ్రీనివాస్ EMI కట్టలేదు. దీంతో.. శ్రీనివాస్ కు లోన్ వేధింపులకు మొదలయ్యాయి. ఫోన్ చేసి EMI కట్టాలని లోన్ రికవరీ ఏజెంట్ల బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్ కట్టకపోతే స్నేహితులకు, బందువులకు తెలియజేసి పరువుతీస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అసలే తల్లి పోయాన పుట్టడు దుఖంతో వున్న శ్రీనివాస్ కు లోన్ కట్టాలని వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో రోజు ఈ వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శ్రీనివాస్ భార్య చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బ్యాంక్ అధికారుల వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటికి పెద్దదిక్కుగా వున్న శ్రీనివాస్ మృతి చెందాడని ఇప్పుడు మాకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరయ్యారు. తగిన న్యాయం చేసేంత వరకు ఈఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టేదే లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kerala: కేరళ హోటల్ యజమాని హత్య కేసులో ట్విస్ట్.. సెక్స్ స్కాండల్ కోణం..