Minister Sridhar Babu : ప్రభుత్వ విద్యను ప్రైవేట్ స్థాయికి తీసుకెళ్తాం
- ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షలకుపైగా అడ్మిషన్లు
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు మంజూరు
- నాణ్యమైన విద్యకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sridhar Babu : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంచిర్యాల జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్ల అమలుపై కట్టుబాటుతో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉత్తమ భోజనం, మెరుగైన వసతులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉందని చెప్పారు. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు.
Also Read
2025-26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 3 లక్షలకుపైగా అడ్మిషన్లు నమోదు కావడం ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్‌పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!