Sri Rama Navami : కమనీయం.. కడు రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి… మణి బాసికమును నుదుటను కట్టి… పారాణిని పాదాలకు పెట్టి.. పెళ్ళికూతురై వెలసిన సీతమ్మ తల్లిని.. సంపగి నూనెను కురులను దువ్వి… సొంపుగ కస్తూరి నామము దీర్చి… చెంపజవాజి చుక్కను పెట్టి.. పెళ్ళికొడుకై వెలసిన రామయ్య తండ్రిని చూసేందుకు రెండు కన్నులు చాలవెమో.. అనిపించే విధంగా అంగరంగ వైభవంగా భద్రాద్రిలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో… మాంగళ్యధారణ చేశారు. తానీషా కాలం నాటి నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్… స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అయితే కరోనా కాటుతో రెండు సంవత్సరాల తరువాత దేవదేవుడి కల్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించారు. తొలుత ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరిపారు. ఆ తరువాత మిథిలా మైదానంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేదమంత్రోచ్ఛరణ నడమ దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అభిజిత్ లగ్నంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు.
Also Read
కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. భక్తుల రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.భక్తులకు పంపిణీ చేసేందుకు వీలుగా 2 లక్షల ప్యాకెట్ల స్వామి వారి తలంబ్రాలను అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం.
https://ntvtelugu.com/key-changes-in-ap-new-cabinet/
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!