ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సహస్ర కలశాభి షేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు శ్రీ స్వామి వారలకు పురుషసూక్త, శ్రీ సూక్త, కల్పోక్త, వ్యాసపూర్వక, శోడషోపచార పూజ, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంచోపనిషత్తులచే మన్యసూక్త, రుద్రాభి షేక పూజలు, సహస్ర కలశాభి షేకం, ప్రత్యేక పూజలు, అర్చనాది ఆరాధన, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం స్వామి వారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక క్షేమార్థం యాగశాల వద్ద యజ్ఞాచా ర్యులు కందాలై పురుషోత్తమచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు హోమం నిర్వ హించారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
ఇక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామంలో శ్రీ వల్మిత వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు.. జిల్లాలోని పలు మండలాలకు చెందిన 49 జంటలకు సామూహిక వివాహాలను జరిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వధూవరులకు నూతన వస్త్రాలను అందించగా.. మరి కొందరు దాతలు పుస్తెలు, మెట్టెలు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక వివాహ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పొంగులేటి అన్నారు. హేమచంద్రాపురానికి చెందిన కొండపల్లి సాయిగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Asani Cyclone: బలహీనపడిన ‘అసని’.. అయినా అప్రమత్తంగానే ఉండాలి