NTV Telugu Site icon

BS Rao: శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత

Bs Rao Death News

Bs Rao Death News

Sri Chaitanya Educational Institutions Chairman Dr BS Rao Passed Away: శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా. బొప్పన సత్యనారాయణ రావు (బీఎస్ రావు) గురువారం (13-07-23) కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్ర గాయాలు అవ్వడంతో బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు. వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందించి, కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ.. మధ్యాహ్నం సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. బీఎస్ రావు భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. రేపు విజయవాడలో అంత్యక్రియలు జరపనున్నారు.

Vaishnavi Chaitanya: ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసావ్ కదయ్యా

కాగా.. బీఎస్ రావు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలని నిర్మించారు. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం.. అంచెలంచెలుగా ఎదుగుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా తన శ్రీచైతన్య విద్యాసంస్థల్ని ఉన్నత స్థానానికి చేర్చారు. ఆయన ఓవరాల్‌గా 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు. శ్రీ చైత‌న్య విద్యాసంస్థల్లో 8.5 ల‌క్షలకు పైగా విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. బీఎస్ రావు దంప‌తులు ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవ‌లందించారు.

MP Mithun Reddy: ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అమ్మఒడి.. ఇక ఎన్నికల తర్వాతే..