Vaishnavi Chaitanya: ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసావ్ కదయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaishnavi Chaitanya: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. మాస్ మూవీస్ బ్యానర్ పై SKN ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్.. గతరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెల్సిందే. ఇక ఈ వేడుకలో వైష్ణవి చైతన్య తన గతాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. ఒక యూట్యూబర్ గా, ఇన్ఫ్లూయెన్సెర్ గా ఆమె పడిన కష్టాలను చెప్పుకొచ్చి కంటనీరు పెట్టుకుంది. ఇన్నాళ్లకు తాను మెయిన్ లీడ్ గా చేసే అవకాశం వచ్చిందని, అందుకు కారణం డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత SKN అని ఆమె చెప్పుకొచ్చింది. అసలు మొదట్లో ఇలాంటి ఒక అవకాశం తనకు వస్తుంది అని అనుకోలేదని, తన మీద తనకే నమ్మకం లేని రోజుల్లో డైరెక్టర్ సాయి రాజేష్ తనను నమ్మాడని, తనలో బేబీ కనిపించిందని, ఈ పాత్రకు తాను అయితేనే సెట్ అవుతుందని చెప్పి దైర్యం ఇచ్చాడని తెలిపింది.
Suchitra Krishnamoorthi: ఈ రాత్రికి నాతో పడుకో.. తెల్లారి ఇంటిదగ్గర దింపుతా అన్నాడు
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక మొదట్లో ఒక సినిమాలో అరనిమిషం పాటు కనిపించినప్పుడే.. నా అంకున్నవారందరికి టికెట్ కొని మరీ వారికి చూపించాను.. ఇప్పుడు సినిమా మొత్తం నేనే ఉన్నాను.. ఇదంతా అవ్వడానికి కారణం సాయి రాజేష్ మరియు SKN అని చెప్పి ఎమోషనల్ స్పీచ్ ఇస్తుండగా.. అంతలోనే SKN టిష్యుస్ తీసుకువెళ్లి.. వైష్ణవి చేతికి ఇవ్వకుండా.. ఆమె కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్న అభిమానులందరూ వైష్ణవి ఎమోషనల్ స్పీచ్ ను వదిలేసి SKN… SKN కమాన్ అంటూ అరవడం మొదలుపెట్టారు. దీంతో అక్కడ నవ్వులు విసిరాయి. పాపం.. పాప ఎంతో ఎమోషనల్ గా తన కెరీర్ గురించి మాట్లాడుతుంటే.. SKN చేసిన ఒక చిన్న పని ఆ ఎమోషనల్ స్పీచ్ ను కాస్తా.. కామెడీ స్పీచ్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో వైష్ణవి రేంజ్ ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!