Spring Fields: 8వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య కాలం మానవజాతి చరిత్రలో ఆర్థిక, సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి విశేషమైన కాలమే ఇస్లాం స్వర్ణయుగం. ఇస్లాం పెరుగుదల, వ్యాప్తి ఒక గొప్ప శాస్త్రీయ, మేధో విప్లవాన్ని ప్రేరేపించింది. ముస్లిం శాస్త్రవేత్తలు గణిత శాస్త్రం, వైద్యం, ఖగోళ శాస్త్రం, ఆప్టిక్స్, రసాయన శాస్త్రంలో గణనీయమైన అభివృద్ధిని సాధించారు. కానీ 800 సంవత్సరాల ఈ గొప్ప వారసత్వం యూరో-కేంద్రీకృత సంస్కృతితో కప్పివేయబడింది. ఇస్లాంకు సంబంధించిన చాలా ఆవిష్కరణలు ఈ రోజు ప్రజలకు చాలా తక్కువమందికే తెలుసు. ఈ నేపథ్యంలో స్ప్రింగ్‌ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ ముస్లిం శాస్త్రవేత్తల సహకారం, గణితం, సైన్స్, లాంగ్వేజ్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లైఫ్‌స్టైల్ రంగాలలో వారి ఆవిష్కరణలను మోడల్స్, కళాఖండాలు, విద్యార్థుల ప్రదర్శనల గ్రాండ్ ఎగ్జిబిషన్‌లో ప్రతి సందర్శకుడికి సుసంపన్నమైన అనుభవాన్ని వాగ్దానం చేస్తోంది.
ఈ ఎగ్జిబిషన్‌ను యునెస్కో మాజీ అధ్యక్షుడు అష్గర్ హుస్సేన్, తెలంగాణ ప్రభుత్వ TMREIS అకాడమిక్ హెడ్ ఎంఎ. లతీఫ్ అతీర్, స్ప్రింగ్‌ఫీల్డ్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్, జయాన్ బాబుఖాన్ ప్రారంభించారు. స్ప్రింగ్‌ఫీల్డ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ ఆలోచన, అతీర్ మద్దతుతో ఎగ్జిబిషన్ నిర్వహించబడింది. మిస్టర్ అష్గర్ హుస్సేన్ విద్యార్థుల విస్తృత పరిశోధన, ప్రదర్శనను ప్రశంసించారు. అతను ప్రసిద్ధ ఇస్లామిక్ ఆవిష్కరణల గురించి మాట్లాడారు. డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ మాట్లాడుతూ మన గొప్ప వారసత్వం గురించి మనం గర్వపడాలన్నారు. ఈ వారసత్వానికి మనం కనెక్ట్ అవ్వాలని.. అందరికీ కమ్యూనికేట్ చేస్తూ సహకరించాలని సూచించారు. లతీఫ్ అతీర్ తన పరిశోధన గురించి మాట్లాడుతూ.. ముస్లిం శాస్త్రవేత్తలపై మొట్టమొదటి ప్రదర్శన చేయడానికి తమ దివంగత వ్యవస్థాపక డైరెక్టర్ బషీరుద్దీన్ బాబుఖాన్ తనను ప్రేరేపించారని, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అనేక ప్రదర్శనలను మెరుగుపరచడం, నిర్వహించడం కొనసాగించారని తెలిపారు. ఈ ప్రదర్శనకు 60కి పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్‌లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు మీడియా మానియా పిఆర్ జి.జయరాంను 9010574196 నంబరులో సంప్రదించవచ్చు.
Read Also: Coronavirus : కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే