NTV Telugu Site icon

South Central Railway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు

South Central Railway

South Central Railway

South Central Railway: తిరుమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లను ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు పొడిగించారు. కాచిగూడ, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్‌లకు పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-తిరుపతి (07061) రైలు 8వ తేదీన, తిరుపతి-కాచిగూడ (07062) రైలు 9వ తేదీన సేవలు అందిస్తాయి. ఈ రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

Read also: Vande Bharat Train: త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్.. రామగుండంలో స్టేషన్

10న కాచిగూడ-కాకినాడ టౌన్ (07417) రైలు, 11న కాకినాడ టౌన్-కాచిగూడ (07418) రైలు నడుస్తుంది. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ-నారాపూర్ (రైలు నెం. 07653) ప్రతి గురువారం 8 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది. నర్సాపూర్-కాచిగూడ (07654) రైలు ప్రతి శుక్రవారం 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ టూ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. దీంతో తిరుమల వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో అధికారులు తిరుమలకు నిత్యం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
NBK 108: టైటిల్ రివీల్ కే గాల్లోకి లేపుతున్నారుగా?