Construction Workers: లేబర్ కార్డు పొందిన భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని, ఏవైనా వ్యాధులు నిర్ధారణ అయితే సంబంధిత ఆసుపత్రులకు రెఫర్ చేస్తామని తెలంగాణ కార్మిక శాఖ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం లేబర్ కార్డుదారులకు రూ.10 వేల వరకు ఖరీదు చేసే 50 రకాల పరీక్షలను ఉచితంగా అందిస్తుంది. అందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మాణ రంగ సంక్షేమ బోర్డు నుంచి గుర్తింపు కార్డు తీసుకున్న ప్రతి కార్మికుడు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఈసీజీ, బీపీ, ఊపిరితిత్తులు, కంటి చూపు, చెవి, ముక్కు, గొంతు, రక్తం, మూత్రం, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైతే హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రధాన ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు. చిన్న చిన్న సమస్యలకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నమోదిత నిర్మాణ కార్మికులందరికీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బాడీ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు. లేబర్ కార్డు లేని వారు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, 2 ఫొటోలు తీసుకుని గ్రామ పంచాయతీకి వెళితే నమోదు చేస్తారు. అయితే మీ గ్రామాల్లో ఈ శిబిరాల గురించి మరింత సమాచారం కోసం, మీరు మండల వైద్యాధికారిని లేదా గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చు.
Read also: Health Tips: నిజమేనా.. పడగడుపున వెల్లుల్లి తింటే బరువు తగ్గుతారా?
మరోవైపు నేడు సచివాలయంలో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్స్ తో సీఎం కేసీఆర్ రివ్యూ చేయనున్నారు. త్వరలోనే నార్లాపూర్ పంప్ హౌస్ వెట్ రన్ తోపాటు ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లపై రివ్యూ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరుకానున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించనున్నారు. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి డ్రై రన్ నిర్వహించారు. డ్రై రన్ విజయవంతం కావడంతో వెట్ రన్ కు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 15 లేదా 17న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Hyderabad: ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. టైమింగ్ మారుస్తారా..?