Pocharam Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని సభాపతి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మీరే పోటీ చేయాలని, నివేదిక మీకు అనుకూలంగా ఉందని సీఎం కేసీఆర్ తనతో చెప్పారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పిల్లల భవిష్యత్తును చూసుకుందాం అని పోచారం అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో 7 కోట్ల 20 లక్షలతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు పోచారం శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్య క్ర మంలో ఆయన వచ్చే ఎన్నిక ల్లో పోటీపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానని, ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని అన్నారు.
పోచారం మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధికి పట్టింపులేని చిరునామాగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో ఆయన కుమారులు పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో తన పోటీపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాడు. కేసీఆర్ ఆదేశాలతోనే మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని కొనియాడారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే పదవుల కోసం పాకులాడటం తప్ప సంక్షేమం, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. తెలంగాణపై అభిమానం, పాలనా అనుభవం ఉన్న కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
MP Asaduddin: కాంగ్రేస్ పార్టీలో ఓవైసీ లాంటి మొగాడెవరూ లేరా?
