Site icon NTV Telugu

Independence Day : అసెంబ్లీలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్‌ పోచారం

Pocharam Srinivas

Pocharam Srinivas

భారతదేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని హోదాలో మోడీ 9వ సారి జాతీయ జెండాను ఎర్రకోటపై ఆవిష్కరించడం విశేషం. అయితే.. ఈ నేపథ్యంలోగా తెలంగాణలోనూ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. ఉదయం తెలంగాణ అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ, 76 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా.. శాసన మండలిలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి మువ్వెన్నల జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే.. అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్‌కు నివాళాలర్పించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తమ నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి తలసాని. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.

Exit mobile version