NTV Telugu Site icon

Monsoon for Telangana: ఈ నెల తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం

Monsoon For Telangana

Monsoon For Telangana

Monsoon for Telangana: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఏపీని తాకాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుండగా మరో మూడు నాలుగు రోజుల్లో ఏపీ అంతటా విస్తరిస్తుంది. ఏపీ రాకతో త్వరలో నైరుతి రుతుపవనాలు తెలంగాణను కూడా తాకనున్నాయి. ఈ నెల 18లోపు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 18వ తేదీని తాకిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు మరికొంత సమయం పడుతుంది. నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించడంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Read also: Rythubandhu Funds: తెలంగాణ అన్నదాతలకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రైతు బంధు నగదు

నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈరోజు పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. అలాగే 15 నుంచి 17వ తేదీ వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే రుతుపవనాలు తగ్గి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. అలాగే భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 4న ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని, జూన్ మొదటి వారంలో తెలంగాణను తాకుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కానీ ఏపీలో ప్రవేశం ఆలస్యమవడంతో తెలంగాణలో అడుగుపెట్టేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. గతేడాది జూన్ 13న నైరుతి ఏపీని తాకగా.. జూన్ 20 నాటికి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. 2021లో జూన్ 5న ఏపీని తాకగా.. ఏడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. మరో రెండు రోజుల్లో కోస్తాంధ్రలో ఎండలు తగ్గే అవకాశం ఉందని, మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. నైరుతి ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి.
Janasena Party Office: జనసేన కార్యాలయంలో సినీ ప్రముఖుల సందడి

Show comments