Site icon NTV Telugu

Train ticket: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై క్యూఆర్‌ కోడ్‌తో పేమెంట్స్

Trainticket

Trainticket

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేసే విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. దీంతో రైల్వే టికెట్‌ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు సులభతరం కానుంది. అలాగే చిల్లర కష్టాలకు కూడా చెక్ పడనుంది.

ఇది కూడా చదవండి: Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటన.. కెప్టెన్స్ వీళ్లే..!

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ విధానంతో టికెట్ కొనుగోలులో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తీరనున్నాయి. ప్రస్తుతం ఈ విధానం ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఉంటుందని.. అనంతరం అన్ని స్టేషన్లకు విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ఇది కూడా చదవండి: Shameful Incident: సమాజం ఎటు వెళ్తుంది.. కూతురిపై కన్న తండ్రి అత్యాచారం

రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్ల దగ్గర క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగించి డిజిటల్‌ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. అన్ని స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల విండో దగ్గర ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన క్యాష్‌లెస్‌ సదుపాయాన్ని .. అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపించామని, దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.

ఇది కూడా చదవండి: Garlic: వెల్లుల్లి కూరగాయా..? లేదా మసాలా..? దశాబ్ధాల చర్చకు హైకోర్టు పరిష్కారం..

Exit mobile version