Mother Tearful: మారుతున్న కాలంతో పాటు బంధాల్లో కూడా మార్పులు వచ్చాయి. కడుపున పుట్టిన పిల్లలైనా, కన్న తల్లైనా .. బంధాలు అనుబంధాలు అన్నీ వ్యాపార బంధాలుగా మారుతున్నాయి. రోజు రోజుకీ మానవ సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయి. కొందరు పుత్రరత్నాలకి చివరికి కన్నతల్లిదండ్రులు కూడా భారమైపోతున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి సహకరించడంలేదంటూ.. జీవాన్ని, జీవితాన్ని ఇచ్చిన అమ్మానాన్నలను అనాథల్లా రోడ్డుమీద వదిలేసి.. చేతులు దులిపేసుకుంటున్నారు.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి.. కన్న బిడ్డలకు భారమైపోతున్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కన్నబిడ్డలు తల్లిని రోడ్డున పడేసిన జ్ఞానులు ఎందరో ఉన్నారు. ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ వేడుకుంటున్నా ఆతల్లికి కడుపున పిడికెడు అన్నం కూడా పెట్టకుండా నడిరోడ్డుపై వదిలేని వైనం తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాణం పోసిన తల్లి పట్ల కొడుకులు అమానుషంగా ప్రవర్తించారు. చిన్నప్పటి నుండి కళ్లల్లో పెట్టుకుని కనిపెంచిన కొడుకులు తల్లిపట్ల మానవత్వం మరిచారు. కొడుకులు బాగా ఎదగాలని తన రెక్కలు ముక్కలు చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా చేసిన.. కన్న తల్లికి పట్టేడు అన్నం పెట్టేందుకు వెనుకాడారు. వయసు మళ్లీ ఆ తల్లి ఆకలి కేకలతో చేతులెత్తి ప్రాధేయపడ్డా అన్నం పెట్టేందుకు ముందుకు రాలేదు. ఆతల్లికి ఏం చేయాలో తెలియక చివరకు పోలీసులను ఆశ్రయించింది. తనకు ఆలనాపాలనా చూడటం లేదని అంతేకాకుండా.. తన కూతుళ్లను చూసేందుకు అనుమతించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లిలో ఈఘటన చోటుచేసుకుంది. వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వయసు రీత్యా పిడికెడు అన్నం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారని వెంకటనర్సమ్మ అనే వృద్ధురాలు ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె కంటతడి పెట్టుకుని ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ ప్రాధేయపడ్డా తన కొడుకులు అన్నం పెట్టడం లేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరి హృదయాలను ఆతల్లి కన్నీపెట్టుకుని కలిచివేసింది.
Traffic Police: సిగ్నల్ క్రాస్ చేస్తున్నారా? అయితే జాగ్రత.. 24గంటలు నిఘా..