Sonia Gandhi Birthday: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పండుగ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె పుట్టిన రోజునే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారని గుర్తు చేశారు. సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, వీహెచ్, ఇతర సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌తో కలిసి రేవంత్ 78 కేజీల కేక్ కట్ చేశారు. అనంతరం నేతలకు వీహెచ్ కేక్ తినిపించారు.
Read also: Gaza : గాజా ఆసుపత్రి ఇంకుబేటర్లో కుళ్లిపోయిన శిశువుల మృతదేహాలు
2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియమ్మ ఉక్కు సంకల్పంతో మా ఆకాంక్షలను నెరవేర్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా మాట మేరకే తెలంగాణ ఇచ్చారని అన్నారు. ‘తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు. తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కృతజ్ఞతతో ఉన్నారని గత ఎన్నికల తీర్పు రుజువు చేసింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యతను అప్పగించారు. నేను వారి సేవకునిగా అందరి కోరికలను తీరుస్తాను. కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేస్తాను’ అని అన్నారు. అని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతుందన్నారు.
Read also: KTR: మరో రోజు సమయం ఇవ్వండి.. శాసనసభ సెక్రటరీని కోరిన కేటీఆర్
పదేళ్లుగా వేలాది కేసులు ఎదుర్కొని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 100 ఏళ్లు సంతోషంగా జీవించాలని సోనియా గాంధీ ఆకాంక్షించారు. శాసనసభలో అడుగు పెట్టే సందర్భంగా ప్రజల మన్ననలు పొందాలి. 6 హామీల్లో రెండు హామీలను సోనియా పుట్టిన రోజు నుంచే ప్రారంభించాలని నిర్ణయించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాలు, కష్టాలతో అధికారంలోకి వచ్చానని, వారి ఆశీస్సులతోనే అసెంబ్లీకి వెళ్తున్నానని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలోని ఒకటో గేటు వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2 పథకాలను ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలందరికీ రూ.10 లక్షల ఉచిత వైద్య సదుపాయాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Ashok Gehlot: ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో బీజేపీ విఫలమైంది..