Suspicion: అనుమానం పెను భూతం లాంటిది. ఒక్కసారి ఎదుటి వ్యక్తి పై అనుమానం వస్తే చాలు వారిని కడతేర్చే వరకు కంటిమీద కునుకు పట్టదు. అది మన కుటుంబంలోని వారైనా లేక వేరొకరైనా సరే. ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లా కల్లూరులో చోటుచేసుకుంది.
Read also: Drive in Theatre: సినిమా ప్రియులకు పండగే.. ఇకపై కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల శ్రీనివాసరావు స్థానికంగా ఎల్లమ్మ, ఉప్పలమ్మ దేవతలకు పూజారిగా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం సంజీవరావు అనే మరో వ్యక్తితో కలిసి పొలానికి మందు వేసేందుకు వెళ్లాడు. వెళుతున్న క్రమంలో శ్రీనివాసరావుకి కుమారుడి వరసయ్యే శివ అకస్మాత్తుగా కత్తి, వేట కొడవలితో వచ్చి దాడికి దిగాడు.
పక్కనున్న సంజీవరావు కాపాడేందుకు ప్రయత్నించగా తప్పుకోకుంటే నీపైనా దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన సంజీవరావు పక్కకు వెళ్లి గ్రామస్తులకు ఫోన్ చేస్తుండగానే శివ శ్రీనివాసరావుపై వేట కొడవలితో మెడ, కాళ్లు, వీపుపై విచక్షణారహితంగా నరికాడు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే శివ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే శివ, శ్రీనివాస్ రావును ఎందుకు చంపాడు అన్నదానిపై కారణం అతని పై అనుమానం. శివ కుటుంబంలో కొంత కాలంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
దీనికి గల కారణం చేతబడి చేయడమే అని బలంగా నమ్మాడు. అదికూడా.. వరుసకు బాబాయ్ అయ్యె శ్రీనివాసరావే చేశాడని శివ బలంగా నమ్మాడు. శ్రీనివాసరావుపై కోపం పెంచుకున్న శివ శ్రీనివాసరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసరావు ఆదివారం పొలానికి వెళ్లినట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. శివ, శ్రీనివాసరావు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే చేతబడి అనుమానం తప్పితే గతంలో వారిద్దరి మధ్యా ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెబుతున్నారు.
Read also: Sandhya Sreedhar Rao: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి
ప్రత్యక్ష సాక్షి సంజీవరావు మాటలు..
పొలంలో మందు చెల్లెందుకు వచ్చిన సమయంలో శివ వచ్చి ఘర్షణ పడి వేట కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేశాడని సంజీవరావు పేర్కొన్నాడు. అడ్డుకోపోయిన తనపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించాడని అక్కడినుండి పారిపోయి పోలీస్ లకు సమాచారం అందించినట్లు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు హత్య జరిగిన తీరును పరిశీలించి ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ఆధారంగా కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Mother Agony: కొడుకు కోసం తల్లి ఆరాటం.. మృత్యువుతో పోరాడుతున్న కన్నబిడ్డ