Site icon NTV Telugu

Solar Eclipse : ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 30న

Solar Elcipse

Solar Elcipse

హిందు శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో విలువుంది. అయితే సూర్య, చంద్ర గ్రహణాల పట్టువిడుపు సమయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఈనెల 30న ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం వచ్చే రోజు అమవాస్యతో పాటు శనివారం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం కాగా.. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు సూర్యాస్తమయానికి కొద్ది సమయం ముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చని నాసా వెల్లడించింది.

ఉరుగ్వే, చిలీ, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్‌ దేశాలలో ఆకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యాస్తమయం సమయంలో గ్రహణం కనిపిస్తుందని పేర్కొంది. అయితే, సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై.. మే 1న ఉదయం 04.07 గంటలకు ముగుస్తుందని నాసా పేర్కొంది. అయితే, గ్రహణ సమయంలో భారత్‌లో రాత్రి అవుతుందని తెలిపారు.

Exit mobile version