NTV Telugu Site icon

MLC Kavitha: స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం.. కారణం ఇదీ..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: నెలసరి సెలవులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాను నిరాశకు గురయ్యానని, ఇలాంటి అజ్ఞానం చూడటం దారుణమని అన్నారు. నెలసరి సెలవులపై వేతనంతో కూడిన సెలవును నిరాకరించడం మహిళల అసలు బాధను విస్మరించడమేనన్నారు. నెలసరి ఒక ఎంపిక కాదు అని చెప్పబడింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఉదయం తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. అయితే.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో రుతుస్రావ పోరాటాలను తోసిపుచ్చడం బాధాకరమన్నారు. ఆమె ఒక మహిళగా, అజ్ఞానాన్ని చూడటం భయంకరంగా ఉందని తెలిపారు.

ఎందుకంటే మన పోరాటాలు, మా ప్రయాణాలు ఓదార్పు కాదని, ఇది ఒక సమానమైన ఆటకు అర్హమైనది, అది రాజీపడలేనిదని పేర్కొన్నారు. మహిళలకు రుతుస్రావం అనేది ఒక ఎంపిక కాదన్నారు. అది బయోలాజికల్ రియాలిటీ అని తెలిపారు. దీనిక్కూడా వేతనంతో కూడిన సెలవులను నిరాకరించడం అసంఖ్యాక మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరిస్తుందని తెలిపారు. అయితే.. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్ల పట్ల సహానుభూతి లేకపోవడం.. ప్రతిదానికీ మనం చేయాల్సిన పోరాటాన్ని చూడటం బాధాకరమని తెలిపారు కవిత. విధాన రూపకల్పనకు.. వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని సహానుభూతి.. హేతుబద్ధతతో పూడ్చాల్సిన సమయం ఆసన్నమైందని కవిత ట్వీట్ చేశారు.

Read also: Aadi Sai Kumar: పాన్ ఇండియా సినిమా ‘రుధిరాక్ష’ గ్రాండ్ లాంచ్…

అసలు ఏం జరిగింది?
రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ఎంపీ మనోజ్ కుమార్ ఝా గురువారం రాజ్యసభలో మాట్లాడారు. నెలసరి సెలవులను తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని యాజమాన్యాలు ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఆమె మట్లాడుతూ.. వేతనంతో కూడిన రుతుస్రావ సెలవుల విధానాన్ని వ్యతిరేకించారు. నెలసరి అనేది శ్రామిక శక్తిలో మహిళలకు వివక్షకు దారితీస్తుందని అన్నారు. రుతుచక్రం ఒక వైకల్యం కాదన్నారు. మహిళల జీవిత ప్రయాణంలో సహజమైన భాగమన్నారు. దీనికి మహిళలకు ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం వల్ల పని ప్రదేశాల్లో వివక్షకు దారి తీస్తుందని తెలిపారు. నెలసరి సెలువులు ఇవ్వాల్సి రావడం వల్ల కొన్ని సంస్థలు మహిళలను ఉద్యోగాల్లో నియమించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవని తెలిపారు. అయితే దీని వల్ల మహిళలకు ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దీంతో ఇరానీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. వీటిపై మహిళా లోకం మండిపడుతున్నారు.

Aadi Sai Kumar: పాన్ ఇండియా సినిమా ‘రుధిరాక్ష’ గ్రాండ్ లాంచ్…

Show comments