Site icon NTV Telugu

MLA Seethakka : కన్నీరు పెట్టుకున్న సీతక్క

Mla Setakka

Mla Setakka

ఆదివాసీలపై జరుగుతున్న అటవీశాఖ దాడులపై సీతక్క కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్టీవీతో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యను పరిష్కరించండీ అంటూ మండిపడ్డారు. కోయ పోఛగూడెంలో మహిళలు జైల్ జీవితం అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీలకు హక్కులేదా? అంటూ ప్ర‌శ్నించారు. ఇష్టం వచ్చినట్టు అధికారులు కొడితే ఊరుకునేది లేదని, తిరగబడాల్సిందే అంటూ మండిప‌డ్డారు. కొత్త అడవిని కొడితే గ్రామసభలు పెట్టండీ అంతేకానీ.. ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తే ఎలా? అంటూ ప్ర‌శ్నించారు సీత‌క్క‌. వాళ్లే అంగిలు చించుకోని వాళ్లే కేసులు పెడుతారా? అంటూ నిప్పులు చెరిగారు. ఆదివాసీలను చూస్తే కొంతమంది అధికారులకు ఎందుకంత ద్వేషం అంటూ మండిప‌డ్డారు.

read also: Live : సీఎం జగన్ నుంచి కార్యకర్త వరకూ ఒకే భోజనం | Ntv

ప్రాజెక్టుల కోసం అడవిని నరికేస్తారు. ఆదివాసీలు పొట్టపోసుకోవడం కోసం అడవిని నరికితే కేసులా? అంటూ సీత‌క్క ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురింపించారు. అందరు ఏకమై ఆదివాసీలకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కోయ పోషగూడెంలో 2003 లో పోడు చేస్తే పట్టాలకు అర్హులేకదా? ఎందుకుఇవ్వడంలేదు? అంటూ ప్ర‌శ్నించారు. పోడు భూముల విషయంలో గవర్నర్ ను కలుస్తామంటూ సీత‌క్క పేర్కొన్నారు. ఆదివాసీలకు పోరాట చరిత్ర ఉందని, ఎదురించాల్సిందే అంటూ సీత‌క్క మండిప‌డ్డారు.
సీఎం కుర్చి వేసుకోని పరిష్కరిస్తా అన్నారు.. మేము మహరాజ కుర్చీ వేస్తాం .. సమస్యనుపరిష్కరించండీ అంటూ సీఎం పై మండిప‌డ్డారు సీతక్క.

Amazon Primeday : భారీ ఆఫర్లతో రానున్న అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌

Exit mobile version