NTV Telugu Site icon

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసుపై సిట్ నివేదిక.. అతడే కీలక సూత్రధారి

Sit On Tspsc Leak

Sit On Tspsc Leak

SIT Report On TSPSC Paper Leak Scam: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంలో రాజశేఖరే కీలక సూత్రధారి అని సిట్ తేల్చింది. ఈ పేపర్ లీక్ కేసులో TSPSCకి ఇచ్చిన నివేదికలో సిట్ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్ ఈ పేపర్‌ని లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. టెక్నికల్ సర్వీస్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన రాజశేఖర్.. ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడని ఆ నివేదికలో తెలిపారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్.. కంప్యూటర్‌ని హ్యాక్ చేసి, పాస్‌వర్డ్‌ని దొంగిలించాడని తేల్చారు. తాను పాస్‌వర్డ్‌ని ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మి చెప్పిన నేపథ్యంలోనే.. కంప్యూటర్‌న హ్యాక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేసి.. ఆ పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కి ఇచ్చాడని చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన ఏఈ పేపర్‌ను రాజశేఖర్ కాపీ చేశాడని, ఆ పేపర్‌ను రేణుకకు ప్రవీణ్ అమ్మాడని వెల్లడించారు. ఇదే సమయంలో గ్రూప్‌-1 పరీక్షాపత్రం కూడా లీకైనట్టు సిట్ గుర్తించింది. అలాగే.. ప్రవీణ్‌కి గ్రూప్-1లో 103 మార్కులు ఎలా వచ్చాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. సెక్రటరీ దగ్గర ప్రవీణ్ పీఏగా చేస్తూ.. గ్రూప్‌-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించారు. మరోవైపు.. ఈ పేపర్ లీక్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల కస్టడీని నాంపల్లి కోర్టు విధించింది. నిందితుల్ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ వేయగా.. ఆరు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో.. నిందితులను మార్చి 18వ నుంచి 23వ తేదీ నుంచి సిట్ అధికారులు విచారించనున్నారు.

Tarun Chugh: కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది.. తరుణ్ చుగ్ ప్రకటన

కాగా.. ప్రవీణ్‌తో ఉన్న సాన్నిహిత్యంతో తన సోదరుడి కోసం రేణుక అనే యువతి ప్రశ్నాపత్రం కోరగా, అతడు నేరుగా ఆమె వాట్సప్ నెంబర్ పేపర్‌ని పంపించాడు. ఈ పేపర్‌ని తన సోదరుడికి పంపగా.. అతడు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడు. భారీ మొత్తం పుచ్చుకొని, తన సన్నిహితులకు పేపర్‌ని లీక్ చేశాడు. అయితే.. ఓ యువకుడితో డబ్బుల విషయంలో తేడాలు ఏర్పడ్డాయి. దాంతో కోపాద్రిక్తుడైన ఆ యువకుడు.. పోలీసులకు ఫోన్ చేసి, ఈ పేపర్ లీక్ విషయాన్ని చెప్పేశాడు. అలా.. ఈ టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసుని విచారిస్తున్న సిట్ అధికారులు.. నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని, రాజశేఖర్‌ని కీలక సూత్రధారిగా తేల్చారు.

Fake PMO Officer: ప్రధాని కార్యాలయ అధికారినంటూ ఫోజ్.. జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ఫ్రూప్ కార్లతో దర్జా.. చివరకు దొరికిందిలా..

Show comments