NTV Telugu Site icon

Singareni Elections: రేపే సింగరేణి ఎన్నికలు.. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌

Singaremi

Singaremi

Singareni Elections: రేపటి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సర్వం సిద్దమైంది. రీజనల్ లేబర్ కమిషనర్, సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు రేపు 11 ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రేపు (బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ షురూ కానుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్‌ పద్ధతినే ఎన్నికలు నిర్వహించనున్నారు. రామగుండం ఏరియాలో మూడు డివిజన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎన్నికల అధికారులుగా డివిజన్‌ ఒక ఆర్డీఓను కలెక్టర్ నియమించారు. రామగుండం ఏరియాలోని RG-1, RG-2, RG-3 డివిజన్లలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు అధికారులు.

Read also: Governor Tamilisai: నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై.. లోక్‌‌సభ ఎన్నికల్లో పోటీపై షాతో చర్చ..!

RG-1లో 11 పోలింగ్‌ కేంద్రాలు, RG-2లో ఆరు, RG-3లో ఆరు మొత్తం 23 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్దం చేసారు. మూడు కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. రామగుండం ఏరియాలోని RG-1లో 5404, RG-2లో 3557, RG-3లో 3884 ఓటర్లు కాగా.. మొత్తం 12 వేల 8 వందల 45 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని 13 కార్మిక సంఘాలు పరీక్షించుకోనున్నారు. కాగా.. ఇప్పటికే పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. కాగా, సోమవారం సంస్థ వ్యాప్తంగా ఆయా డివిజన్ల అధికారులు పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్ రోజున ప్రతి ఉద్యోగి తమ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు చూపించనిదే లోనికి అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. కావున వచ్చేవారు తప్పకుండా గుర్తింపుకార్డు తప్పని సరిగా తెలిపారు.

తెలంగాణలో కొత్త ఆరు జిల్లాలు 11 ఏరియాల్లో సింగరేణి విస్తరించింది. కాగా.. మొత్తం 39 వేల 809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి ఎన్నికల్లో ఏరియాల వారీగా కార్మికులు..

* కార్పోరేట్‌ లో 1,191 మంది,

* కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది,

* ఇల్లెందులో 613 మంది,

* మణుగూరులో 2,452,

* రామగుండం-1 లో 5,404,

* రామగుండం-2 లో 3,557,

* రామగుండం-3 లో 3,884,

* భూపాలపల్లిలో 5,395 మంది

* బెల్లంపల్లి లో 998

* మందమర్రిలో 4,838,

* శ్రీరాంపూర్‌ లో 9,149,
Vangaveeti Ranga Death Anniversary: వంగవీటి రంగా వర్ధంతి వేడుకలకు దూరంగా రాధా!

Show comments