Site icon NTV Telugu

Sigachi Blast : పటాన్‌చెరు పేలుడు విషాదం.. 39 చేరిన మృతుల సంఖ్య

Sigachi Company

Sigachi Company

Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశామైలారం లోని సిగాచి ఇండస్ట్రీస్‌ (Sigachi Industries) ఫార్మా కంపెనీలో ఇటీవల జరిగిన భారీ పేలుడు అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 39కి చేరింది. ఇప్పటికే 38 మంది మృతి చెందగా, తాజాగా ధృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు మరణించడంతో మరణాల సంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమ్‌రావుగా గుర్తించారు.

Bihar: యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 257.. 30కి 225 మార్కులు.. విద్యార్థులు లబోదిబో

ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 61 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 31 మంది మృతుల డెడ్‌బాడీలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా 23 మంది గాయపడిన కార్మికులకు చికిత్స కొనసాగుతుండగా, 9 మంది ఆచూకీ తెలియకపోవడంతో వారికోసం రెస్క్యూ బృందాలు ముమ్మరంగా శోధనలు జరుపుతున్నాయి.

ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో, సిగాచి సంస్థ యాజమాన్యం స్పందించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని కంపెనీ ప్రకటించింది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై మరోసారి తీవ్ర చర్చను రేకెత్తించిన ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Baby Sale : నిజామాబాద్‌ జిల్లాలో పసికందు విక్రయ కలకలం

Exit mobile version