Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫేజ్-3 లోని సిగాచి (Sigachi) పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) బృందం నేడు సంఘటన స్థలాన్ని సందర్శించనుంది. NDMA బృందం, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (SDMA) తో కలిసి పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై సవివరంగా అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, భద్రతా లోపాలు, గ్యాస్ లీక్ లేదా రసాయన సంచయాల దుర్వినియోగంపై సమగ్రంగా దర్యాప్తు జరగనుంది.
పేలుడు ఘటన చోటుచేసుకున్నది తొమ్మిది రోజుల క్రితం. అప్పటి నుంచి రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలంలో మృతదేహాల కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 42 మంది కార్మికుల మృతదేహాలు వెలికి తీసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇంకా 8 మంది ఆచూకీ తెలియరావడం లేదు. వారి ఆచూకీ లభిస్తుందేమోనని ఆందోళనతో ఎదురు చూస్తున్నారు కార్మికుల కుటుంబసభ్యులు.
పేలుడులో కొంతమంది మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, అధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఆలస్యం జరగకుండా, మృతుల గుర్తింపు కోసం ఆయా శాఖలు సమన్వయంగా పని చేస్తున్నాయి.
ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 143 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 61 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన 18 మంది చికిత్స పొందుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదివరకే చికిత్స అనంతరం 14 మంది కార్మికులు డిశ్చార్జ్ అయ్యారు.
NDMA బృందం పరిశ్రమను పరిశీలించనున్న ఈ సందర్భం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడంలో కీలకంగా మారనుంది. పరిశ్రమ భద్రతా ప్రమాణాలు, శ్రామికుల రక్షణ చర్యలపై ఈ అధ్యయనం ప్రభావం చూపే అవకాశం ఉంది.
Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా రికార్డ్ ను వదిలేశా.. వియాన్ ముల్డర్ సంచలన వ్యాఖ్యలు..!
