Site icon NTV Telugu

CM Revanth Reddy : సిగాచి ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : సంగారెడ్డిలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్‌ పేలుడు రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సిగాచి ప్రమాదం అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణించిన సీఎం రేవంత్, “ఇలాంటి ఘోర ప్రమాదం తెలంగాణ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. ఇది తీవ్రంగా కలిచివేసే విషాద సంఘటన. మేము బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం,” అని తెలిపారు.

Bhopal: భోపాల్‌లో దారుణం.. ప్రియురాలిని చంపి.. స్నేహితుడితో మందు పార్టీ.. చివరికిలా..!

ప్రమాదంపై అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 143 మంది కార్మికులు ఉన్నట్లు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్లు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు పొందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా.. తీవ్రంగా గాయపడి పని చేయలేని స్థితిలో ఉన్న వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారి పిల్లల చదువు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అలాగే, ఈ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

పరిశ్రమలకు భద్రత ప్రమాణాలపై పునర్మూల్యాంకనం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. “ప్రమాదానికి సంబంధించి కొన్ని ప్రాథమిక సమాచారం మా వద్ద ఉంది. అయితే పూర్తి నిజాలు తెలియాలంటే సమగ్ర విచారణ అవసరం. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తాం,” అని సీఎం రేవంత్ తెలిపారు.

Megha Start: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో చిరు సందడి.. పిక్స్ వైరల్ !

Exit mobile version