NTV Telugu Site icon

Minister Ponnam Prabhakar: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కు మంత్రి పొన్నం భూమి పూజ..

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Minister Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దసరా కానుకగా 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపన ఈరోజు జరుగుతోందన్నారు. ఒక్క స్కూల్లో 2560 మంది విద్యార్థులు, నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు ఉండనున్నాయని తెలిపారు. ప్రతి పాఠశాలలో 120 మంది టీచర్స్ ఉంటారన్నారు. ప్రతి తరగతిలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ సెంటర్లు, 5000 పైగా పుస్తకాలతో లైబ్రరీ అనుసంధానం చేసి ఉంటుందని తెలిపారు. కుల మత వర్గ అంతరం లేని విద్యా సౌధం నిర్మించి, అన్ని వర్గాల పిల్లలు ఒకే దగ్గర, ఒకే కుండా కుటుంబంలా చదువుకునేలా ఇవి ఉండబోతున్నాయని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గత 10సంత్సరాలుగా ఎడుకేషన్‌ పై నిర్లక్ష్యం జరిగిందన్నారు. తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయిన తరువాత విద్యార్థి జీవితంలో మార్పు తేవాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన జరుగుతుందని తెలిపారు.


Devara : భారీ లాభాలతో దూసుకుపోతున్న ‘దేవర’