NTV Telugu Site icon

Harish Rao: దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయాలి.. ప్రభుత్వానికి హరీష్ రావు మరో డెడ్ లైన్..

Harish Rao

Harish Rao

Harish Rao: దసరా పండుగ లోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ ఇచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే వరకు సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు డెడ్ లైన్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలకు మాయమాటలు చెప్పారు. రైతు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం సాకులు చెబుతోందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు 21 లక్షల మంది అన్నదాతల రుణాలు ఇంతవరకు మాఫీ కాలేదని ఆరోపించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అందలేదని హరీష్ రావు అన్నారు.
Maharastra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కార్యాలయంపై దాడి.. పారిపోయిన నిందితురాలు