MLA Kunamneni: సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉంది.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులను ఉగ్రవాదుల కంటే దారుణంగా మోడీ సర్కార్ చూస్తుందని విమర్శలు గుప్పించారు.
Read Also: Donald Trump: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని నాకు ముందే తెలుసు..
ఇక, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్స్ దే పాత్ర ఉందని తమకు ఏం తెలియదని అనడం సరికాదు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కేసీఆర్ సంపన్నమైన రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారు అని ఆరోపించారు. అలాగే, ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతున్నాం.. ఈ ప్రమాద ఘటనపై కేంద్రం ఫెయిల్ అయింది.. మాజీ ముఖ్యమంత్రి ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతోంది.. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దు అని కూనంనేని సూచించారు.
