Site icon NTV Telugu

Viral : ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

School Lock

School Lock

Viral : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం దొమ్మాట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో మొత్తం 36 మంది విద్యార్థులు ఉండగా, వారిని బోధించేందుకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే వారిలో ఒకరు డిప్యూటేషన్ పై మరో పాఠశాలకు వెళ్లడంతో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగుతోంది.

The Raja Saab: బర్త్​ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఈ పరిస్థితిపై అసహనం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్‌ చేశారు. “ముగ్గురు టీచర్లు తిరిగి నియమించే వరకు స్కూల్ తాళం తీయమని” తల్లిదండ్రులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నిరాశ వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను కోరారు. గ్రామస్థులు కూడా తల్లిదండ్రుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ, విద్యార్థుల కోసం అవసరమైన ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

YS Jagan: చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు.. ఉద్యోగుల అంశంపై మాజీ సీఎం జగన్ సీరియస్..!

Exit mobile version