Collector Gunman: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య ఘటన మరువకముందే.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. నరేష్ తన భార్య, ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విధులకు హాజరు కాకపోవడంతో అనుమానంతో ఇంటికి వెళ్లి చూసే సరికి అందరూ షాక్ అయ్యారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చిన్నకోడూరు మండలం రమలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునికి చెందిన ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పీఎస్‌వోగా పనిచేస్తున్నారు. రోజులాగే విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా 9ఎంఎం పిస్టల్ తీసుకొచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టగానే గన్ తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కూతురు హిమశ్రీలను కాల్చి చంపాడు. ఆ తర్వాత తను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం ఆన్లైన్ బెట్టింగ్ చేసిండు దాదాపుగా 70 నుంచి 80 లక్షలు అప్పు అయిందని సమాచారం. గన్ మెన్ అత్త కొంచెం డబ్బు సహాయం చేసిన అప్పులు తీరలేదు. అప్పులకోసం చివరకు ల్యాండ్ అమ్మకున్నా అప్పులు తీరలేదు దీంతో ఏం చేయాలో తెలియక భార్య, పిల్లలను చంపి తను గన్ తో కాల్చుకున్నాడు నరేష్.
Read also: MLC Kavitha: స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం.. కారణం ఇదీ..
తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ అధికారి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోన్ రికవరీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం కూతురితో కలిసి డ్యూటీకి వచ్చిన ఫజన్ అలీ.. తన కూతురు కళ్ల ముందే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
Ramakrishna: ఎన్నికలు జరగకముందే.. సీఎం జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారు!