Site icon NTV Telugu

TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు..

Telangana Police

Telangana Police

పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చిన బోర్డు… ఇక పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలను పోలీసు నియామక బోర్డు ఖరారు చేసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కానిస్టేబుల్‌ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, కానిస్టేబుల్‌ పరీక్షను 21 తేదీల్లో నిర‍్వహించనున్నారు. ప్రిలిమ్స్‌ రాత పరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూలై 30వ తేదీ నుంచి ఎస్సై, ఆగస్టు 10వ తేదీ నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థులు హాల్ టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.

పోలీసు నియామక బోర్డు ఓవైపు దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోగా… పరీక్షల నిర్వహణలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రిలిమినరీ రాతపరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అదే నెల 21న కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాత్రి నుంచి కురిసే అవకాశం

ప్రస్తుతం సెంటర్లు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆగస్టు మాసంలో ఎగ్జామ్ నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటికే దాదాపు 14 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో చాలామంది రెండు నుంచి మూడు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాల ఎంపిక క్లిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పటిష్టమైన కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషన్లతో సంప్రదింపులు జరుపుతోంది.

Exit mobile version