NTV Telugu Site icon

హైదరాబాద్ మారథాన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ యూనిట్ సందడి

ఎయిర్‌టెల్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్‌ మారథాన్‌ పదో ఎడిషన్‌ను ఆదివారం నాడు సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా నుంచి గచ్చిబౌలి వరకు ఈ మారథాన్‌ కొనసాగుతోంది. ఈ మారథాన్‌లో ఆరువేల మంది పాల్గొన్నారు. పీపుల్స్‌ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్‌ మారథాన్)‌, 21 కిలోమీటర్లు (హాఫ్‌ మారథాన్‌), 10కే మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ యూనిట్ కూడా సందడి చేసింది.

Read Also: వరంగల్ బాలుడికి అరుదైన అవకాశం

ఈ సందర్భంగా హీరో నాని, హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టి హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని రన్నర్లను ప్రోత్సహించారు. మారథాన్‌లో వీళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈనెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కోసం వీళ్లు మారథాన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ మారథన్ నేపథ్యంలో పీపుల్స్‌ ప్లాజా నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.