NTV Telugu Site icon

Nizamabad: వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ ఇచ్చాడు..

Shoping Mall

Shoping Mall

తాగ‌డానికి మంచి నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన ఘ‌ట‌న నిజామాబాద్‌ లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మహమ్మద్‌నగర్‌ గ్రామానికి చెందినశ‌నివారం సాయంత్రం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విజ‌య్ కుమార్ అనే వ్య‌క్తి దుస్తుల కొనేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వ‌చ్చాడు. అయితే నెహ్రూపార్కు స‌మీపంలోని ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళి దుస్తులు కొనుగోలు చేశారు.

కాసేపు ఆ షాపింగ్ మాల్ లో తిరిగిన అనంత‌రం దాహం వేయ‌డంతో విజ‌య్ కుమార్ సిబ్బందిని అడిగాడు. అయితే సిబ్బంది నీళ్ల బాటిల్ అనుకొని ఆసిడ్ బాటిల్ ను ఇచ్చారు. కాగా విజ‌య్‌కుమార్ ఆ.. ఆసిడ్ ను నోటిలో వేసుకోగానే గొంతులో మంట ప్రారంభ‌మై అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. హుటాహుటిన కుటుంబ స‌భ్యులు ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. విజ‌య్ కుమార్ కు చికిత్స అందిస్తున్న వైద్యులు ప‌రిస్థితి ఇప్పుడే ఏం చెప్ప‌లేమ‌ని అంటున్నార‌ని మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్‌కు తరలించారు కుటుంబ స‌భ్యులు.

అయితే.. షాపింగ్ మాల్ నిర్వ‌హ‌కుల‌తో విజ‌య్ కుమార్ కుటుంబ సభ్యులు గొడ‌వ‌కు పాల్ప‌డ్డారు. షాపింగ్ మాల్ లో ప‌నిచేస్తున్న ఆనంద్ అనే ఉద్యోగి ఆ బాటిల్ లో యాసిడ్ లేద‌ని నేను తాగుతానంటూ కొంచెం నోట్లో పోసుకున్నాడు దీంతో అత‌నికి గొంతులో మంట‌రేగి ఉద్యోగి ఆనంద్ కూడా అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో.. షాపింగ్ యాజ‌మాన్యం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LIVE: ఆదివారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..