ప్రస్తుతం శిల్పా చౌదరి కేసు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. ఇక తాజాగా శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎట్టకేలకు పోలీసులు ముందు నోరూ విప్పింది శిల్పా. రాధికా రెడ్డి అనే రియాల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది శిల్పా. రియల్ ఎస్టేట్ తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ నడుపుతున్న రాధికా రెడ్డికు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. రాధికా రెడ్డికి ఆరు కోట్లు ఇచ్చింది శిల్పా చౌదరి. ఆరు శాతం వడ్డీకి శిల్పా దగ్గర తీసుకుంది రాధికా రెడ్డి. ఇక ఈ కేసులో కొత్తగా వచ్చిన రాధికా రెడడ్డి పాత్రఫై పోలీసుల ఆరా తీస్తున్నారు.
నన్నే ఒక్కరు మోసం చేసారంటూ స్టేట్మెంట్ ఇచ్చిన శిల్పా…
