NTV Telugu Site icon

Shamshabad Airport New Look: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్తరూపు

Rgia1

Rgia1

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కొత్త రూపు దిద్దుకుంది. విస్తరణ పనులు పూర్తి కావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ను ప్రారంభించారు అధికారులు. విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దారు. ఇక ఈ రోజు నుండి అంతర్జాతీయ విమానాలు ఈ టర్మినల్ నుండి నడవనున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో మైలురాయికి చేరువైంది. ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు పూర్తికావడంతో నూతన అంతర్జాతీయ టర్మిణల్ ప్రారంభమైంది. సెకండ్ ఫేస్ పనులు ముగింపు దశకు చేరడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు జిఎంఆర్ ఆధికారులు‌.

అంతర్జాతీయ హంగులతో రూపుదిద్దుకున్న రంగురంగుల వాటర్ ఫాల్స్ ప్రయాణికులను ఇట్టే కట్టిపడేస్తున్నాయ్. 2005 లో మూడేళ్ల లక్షంతో మొదలు పెట్టిన జిఎంఆర్ సంస్థ 2008 లోనే కేవలం 30 నెలలో ఎయిర్ పోర్ట్ ను అందుబాటులోకి తేవడం ద్వారా రికార్డ్ సృష్టించింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో 12 మిలియన్ ప్రయాణికుల సామర్ధ్యంతో ఈ ఎయిర్ పోర్ట్ ను నిర్మించారు. సౌత్ ఏషియా లోనే తొలి గ్రీన్ బిల్ట్ ఎయిర్ పోర్ట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగింది. అయితే 12, మిలియన్ ప్రయాణికుల సామద్యంతో ఎయిర్ పోర్ట్ ను నిర్మించినప్పటికి ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రెండింతలు దాటింది. దీంతో రెండు సంవత్సరాల క్రితం ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులకు జిఎంఆర్ సంస్థ శ్రీకారం చుట్టింది. 35 మిలియన్ ప్రయాణికుల సామర్థ్యంతో టర్మినల్ ను విస్తరించారు.

Read Also: Srujana: సృజనా తిన్నావారా.. వదిలేస్తున్నావా ఆడియో గుర్తుందా.. ఆ సృజన ఈ అమ్మాయే

ప్రస్తుతం విస్తరణ పనులు ముగియడంతో అంతర్జాతీయ హంగులతో ఎయిర్ పోర్ట్ సర్వాంగ సుందరంగా రుపొందించారు. ప్రయాణికులను ఇట్టే కట్టిపడేసేల నూతన టెర్మినల్ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. నూతన టెర్మినల్ పూర్తి కావడంతో ఈ రోజు దానిని ప్రారంభించారు. ఇక ప్రధాన టెర్మినల్ ద్వారానే విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని జిఎంఆర్ ఆధికారులు‌ తెలిపారు. విమానాశ్రయ దశలవారి విస్తరణలో భాగంగా తాత్కాలికంగా అంతర్జాతీయ టర్మిణల్ ను ముసివేస్తున్నారు. ప్రధాన టెర్మినల్ కు అనుసంధానంగా విస్తరణ పూర్తయ్యాక అక్కడి నుండి సర్వీసులు మళ్ళీ ప్రారంభమౌతాయని తెలిపారు.

అప్పటివరకు దేశియ టర్మినల్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతాయని ఆధికారులు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం ఎస్ వి 750కి అంతర్జాతీయ విమానం భయలుదేరనునట్లు ఆధికారులు వెల్లడించారు. అప్పటి నుండి అంతర్జాతీయ విమానాలు దేశీయ టర్మనల్ నుండి వెళ్ళాలని తెలిపారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. టెర్మినల్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నిర్మాణంతో ఎయిర్ పోర్ట్ రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు ప్రయాణికులు.

Read Also; Karthikeya: కార్తికేయ ‘బెదురులంక 2012’ ప్రీ-లుక్ రిలీజ్