Site icon NTV Telugu

షేక్‌పేట్‌ తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ.. కోట్ల విలువైన స్థలం కబ్జాకు స్కెచ్..

Shaikpet

Shaikpet

కబ్జా కోరులు రెచ్చిపోతున్నారు.. కోట్లాది విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు… షేక్‌పేట్‌ తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు ఏకంగా.. 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు.. ఏసీబీ ప్రధాన కార్యాలయం ముందు ఉన్న 9 ఎకరాల స్థలంపై కన్నువేసిన కబ్జా కోరులు.. అందుకోసం షేక్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు.. ఈ వ్యవహాన్ని పసిగట్టిన తహసీల్దార్.. రామ చంద్రరావు అనే వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఇక, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామచంద్రరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు..

Exit mobile version