Site icon NTV Telugu

KTR: ఇలాంటి క్రిమినల్స్ కు కఠినశిక్ష పడాలి

Jharkhand (1)

Jharkhand (1)

సమాజంలో జరిగే వివిధ ఘటనలపై తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు మంత్రి కేటీఆర్. రాజకీయా అంశాలతో పాటు అనేక కీలక విషయాలపై సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా జార్ఖండ్‌లోని ద‌మ్కాలో ఓ 12 ఏండ్ల బాలిక‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘ‌ట‌న‌పై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలిక‌ను హ‌త్య చేసిన అత్యంత క్రూర‌మైన క్రిమిన‌ల్ షారూఖ్‌కు ఈ స‌మాజంలో స్థానం లేద‌ని కేటీఆర్ అన్నారు. ఆ క్రిమిన‌ల్‌లో ఎలాంటి ప‌శ్చాత్త‌పం క‌నిపించ‌డం లేద‌న్నారు.

ఐపీసీ, క్రిమిన‌ల్ ప్రోసిజ‌ర్ కోడ్‌, జువైన‌ల్ చ‌ట్టాల‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇలాంటి నిందితుల‌కు క‌ఠిన‌మైన శిక్ష‌ల‌ను విధించాల‌న్నారు. నిందితులు బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండాలంటే బ‌ల‌మైన చ‌ట్టాలు అవ‌స‌రం అని కేటీఆర్ పేర్కొన్నారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

Exit mobile version