Shabbir Ali Comments On BJP BRS Parties: మాజీ మంత్రి షబ్బీర్ అలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని.. ఆ రెండు పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని కుండబద్దలు కొట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సెంట్రల్ మంత్రులతో కేటీఆర్ రహాస్య సమావేశాలు నిర్వహించడంలో మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులని కలువకుండా, డీల్లిలో వారిని ప్రత్యేకంగా కేటీఆర్ ఎందుకు కలిశారు? అని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలే అందుకు కారణమని వ్యాఖ్యానించారు.
Samantha :తన బెస్ట్ ఫ్రెండ్ ఫోటోను షేర్ చేసిన సమంత..
టేక్రియాల్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూం ఇళ్లల్లో నాణ్యత లోపం ఉందని, అందుకే ప్రజలు ఆ ఇళ్లు వద్దంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. నాసిరకంతో ఇళ్లను నిర్మించి, కాంట్రాక్టర్లు కమీషన్లకు ఆశ పడ్డారని పేర్కొన్నారు. ఇండ్లు కట్టేది మేస్త్రీలని, వాళ్ల పట్ల అవహేళనగా మాట్లాడటం ఏమాత్రం సరైందని కాదని, వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై చర్చకు తాను సిద్ధమని.. ఏరోజు, ఎక్కడికి, ఎప్పుడూ రావడానికైనా తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కూలిపోతే, అందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకులే కారణమన్నారు. చర్చించేందుకు తనకు 12 గంటల ముందు సమాచారం ఇవ్వాలని, నువ్వు ఎంతమందితో వచ్చినా నేనొక్కడినే వస్తానంటూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు సవాల్ విసిరారు.
Udhayanidhi Stalin: చివరి చిత్రమన్నాడు.. నిర్మాత నోటీసులు పంపాడు
ఇదే సమయంలో.. కేవలం కాంగ్రెస్ పార్టీలో టికెట్ సంపాదించడం కోసమే షబ్బీర్ అలీ రోడ్ షో నిర్వహించారని గంప గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై కూడా షబ్బీర్ అలీ స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడినని, తాను ఒకరికి టికెట్ ఇప్పించే స్థాయిలో ఉన్నానని, టికెట్ కోసం రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. అలాగే.. బీజేపీ నుంచి తమ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి లిస్ట్ కూడా చాలా ఉందంటూ షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్ చేశారు.