Site icon NTV Telugu

SFI Demands: ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలి

తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో 91,142 ఉద్యోగాలతోనే నిరుద్యోగ నిర్మూలన సాధ్యంకాదు. ఒకేసారి ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో TSPSC పోర్టల్ లో 29 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలతో ఏమాత్రం ఉపశమనం కలుగుతుంది అని ప్రశ్నించారు. ఎన్నో ఎళ్ళ నుండి విద్యార్ధులు ఉద్యోగాలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అందుకే గత ప్రకటన లాగా కాకుండా తక్షణమే ప్రకటించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల పక్రియ చేయాలని ఎస్.ఎఫ్.ఐ.కోరుతుంది.

https://ntvtelugu.com/march-9th-is-historical-date-in-telangana-says-by-trs-mlc-kavitha/

పీ.ఆర్.సీ కమిటీ చెప్పినట్లు 1 లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలు ఒకేసారి భర్తీ చేయాలని, ప్రతి జిల్లాలో స్థానిక పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. ఇదే సందర్భంలో కోచింగ్ సెంటర్ల దోపిడీని కూడా ఆరికట్టాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది. గత ప్రకటనలు లాగా కాకుండా తక్షణమే ఉద్యోగ నియామక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టాలని ఎస్.ఎఫ్.ఐ.డిమాండ్ చేసింది.

Exit mobile version