NTV Telugu Site icon

JEE Exam: జేఈఈ స్మార్ట్ కాపీయింగ్ కేసు.. సంస్థ నిర్లక్ష్యంపై పోలీసులు సీరియస్‌

Jee

Jee

JEE Exam: జేఈఈ మెయిన్స్ స్మార్ట్ కాపీయింగ్ కేసులో కీలక పరిణాలు చోటుచేసుకున్నాయి. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన ఓ టాపర్ విద్యార్థి తన స్నేహితుల కోసం స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐదుగురు విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి సమాధానాలను ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినట్లు గుర్తించారు. స్మార్ట్ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులు తమ స్మార్ట్‌ఫోన్‌లను లోదుస్తుల్లో దాచుకుని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించినట్లు నిర్ధారణ అయింది. స్మార్ట్ ఫోన్లను లోదుస్తుల్లో దాచుకుని తనిఖీలు చేయించుకోకుండా అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ఎగ్జామ్ హాల్ లో ప్రవేశించినట్లు విచారణలో తేలింది. జేఈఈ పరీక్ష నిర్వహణలో ప్రైవేటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు సీరియస్ గా విచారణ చేపట్టారు. కంపెనీ నిర్లక్ష్యాన్ని కూడా సీరియస్ గా తీసుకున్న పోలీసులు పరీక్షా కేంద్రానికి స్మార్ట్‌ఫోన్లు తీసుకెళ్లకపోవడానికి ఎవరు కారణం అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

Read also: Naga chaitanya : ఆ సూపర్ హిట్ సినిమా ను రీ మేక్ చేయబోతున్న నాగ చైతన్య..!!

మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన వారిలో ఇద్దరు విద్యార్థులు మల్లాపూర్‌, ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌, మౌలాలిలో కనిపించారు. కడపకు చెందిన ఓ మైనర్ టాపర్ విద్యార్థి తాను రాసిన సమాధానాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా మరో నలుగురికి షేర్ చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఐదుగురు నిందితుల స్మార్ట్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులపై ఐపీసీ 188, 420, తెలంగాణ పబ్లిక్ పరీక్షల చట్టంలోని 4(బి), 8 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్లు, పరిశీలకులకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. వారి వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. అలాగే 41 సీఆర్‌పీసీ కింద విద్యార్థులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితులను విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దీంతో ఎవరెవరి పేర్లు బయటకు రానున్నాయనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
Arvind Kejriwal: ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భేటీ