NTV Telugu Site icon

Bodhan Tension: బోధన్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు.. కుట్ర అతడిదే..!

బోధన్‌ ఇష్యూ ఇప్పుడు చర్చగా మారింది.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బంద్‌ వరకు వెళ్లింది పరిస్థితి.. దీంతో 144 సెక్షన్‌ విధించిన పోలీసులు.. స్థానికేతరులను ఎవ్వరినీ బోధన్‌లోకి రానివ్వకుండా ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. తనిఖీలు చేస్తున్నారు.. అయితే, బోధన్ అల్లర్ల వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఆ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని తేల్చారు పోలీసులు.. శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఉన్నట్టుగా గుర్తించారు.

Read Also: Muralidhar Rao: తెలంగాణ దేశంలో ఉందా? పాక్‌లోనా..? శివాజీకి జై అంటే నేరమా..?

అయితే, నెల రోజుల క్రితం మున్సిపల్‌ కౌన్సిల్‌లో శివాజీ విగ్రహం ప్రతిష్ఠానకు తీర్మానం చేశారు.. కానీ, ఎప్పుడు ప్రతిష్టించాలనే విషయంపై కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోలేదు. దీంతో, వారం క్రితమే గోపి, కౌన్సిలర్ శరత్‌లు కలిసి విగ్రహ ప్రతిష్టకు ప్లాన్‌ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవ్వరికీ తెలియకుండా వ్యవహారం నడిపించిన గోపి, శరత్‌… రాత్రికి రాత్రే శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక, అల్లర్ల వెనుకాల ఉన్న ఉద్దేశాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.. బోధన్ అల్లర్ల వెనుకాల ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు అడిషనల్ డీజీ నాగిరెడ్డి.