Ponguleti Srinivasa Reddy: పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ఎన్ని కోట్లు ఖర్చైనా సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే అని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో రెండు నెలల్లో హై టెన్షన్ వైర్లని తొలగిస్తానని తెలిపారు. కొత్త రేషన్ కార్డు కొత్త పెన్షన్ లేదు రాబోయే కొద్ది రోజుల్లో మీ పేదోడి ప్రభుత్వం కార్డుతో పాటు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుద్దని మీకు తెలియజేస్తున్నా అన్నారు. ఆరోగ్య విషయంలో చదువుల విషయంలో ఎంత ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం పెద్దపేట రెండిటికీ ఏసింది అని కూడా మీకు చెప్తున్నా అన్నారు. పేదోళ్లకు ఇళ్ల స్థలం యిచే బాధ్యత నాది అని తెలుపుతన్న అన్నారు.
Read also: నైట్ షిఫ్ట్ చేస్తున్నారా..? సంతాన సమస్యలు ఖాయం
అతి కొద్ది రోజుల్లో పాలేరు నియోజకవర్గా పేద ప్రజల కోసం కార్పొరేట్ హాస్పిటల్ కట్టిస్తా అన్నారు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే కబ్జా కి గురైన ప్రతి ప్లాటిని వెలికి తీస్తా అన్నారు. నా వాళ్లు మీ వాళ్ళు అనే తేడా లేకుండా నాకోసం పనిచేసిన నాయకులైన ఎవరిని ఉపేక్షించేది లేదు ప్రతి స్థలాన్ని వెలికి తీసే బాధ్యత నాదన్నారు. పాలేరు నియోజకవర్గం లో ప్రతి ఇంటి ముందు ఎన్ని కోట్లు ఖర్చైనా సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే అన్నారు. గ్రామాల్లో రోడ్లు వెడల్పు చేయాలంటున్నారు రోడ్డుకి ఇరు ప్రక్కల ఉన్న ప్రజలు సహకరిస్తే ఎంత ఖర్చైనా రోడ్లు వెడల్పు చేస్తానని తెలిపారు.
AP-TG Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..