NTV Telugu Site icon

Nama Nageswara Rao: అనుభవంతో చెబుతున్నా.. మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తారు

Mp Nama Nagesahwer Rao

Mp Nama Nagesahwer Rao

Nama Nageswara Rao: మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తారు నాకున్న అనుభవంతో చెబుతున్నానని బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డిని గతం లో నాకు వచ్చిన మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ అయిదారు నెల్లు చిన్న చిన్న మనసు మనస్పర్ధలు ఉన్న పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలిని పిలుపు నిచ్చారు. ఎలక్షన్లు వస్తున్నాయంటే మాయమాటలు చెప్పి మోసం చేసే వాళ్ళు వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జిల్లాలో గతంలో కొంతమంది మోసం చేశారన్నారు. మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడుస్తారు నాకున్న అనుభవంతో చెబుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో మేమిద్దరం గాడి ఎడ్లలా పని చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. సొసైటీలను లాభాల బాట పట్టాలన్నారు. మండలంలోని చెన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో ధ్వజస్తంభం, ముత్యాలమ్మ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ఎంపీ నామా నాగేశ్వరరావు రూ.2,01116, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి రూ.6లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా యాగశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?