NTV Telugu Site icon

K. Laxman: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత చాలా ఉంది..!

Dr K Laxman

Dr K Laxman

K. Laxman: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత చాలా ఉందని రాజ్యసభ ఎంపీ డా.కె లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో CSF నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లక్ష్మణ్ పాల్గొని.. గాంధీ నగర్ డివిజన్ లోని అశోక్ నగర్ రోడ్ నంబర్ 4 లో కాలని వాసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం అశోక్ నగర్ కమ్యూనిటీ హాల్ లో, అడిక్మెట్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో నూతన ఫర్నీచర్, ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద వారి అభివృద్ధి తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోడీ స్ఫూర్తి అన్నారు. ప్రధాని మోడీ స్ఫూర్తితో ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క సౌజన్యంతో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే పలు కాలనీల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Read also: Seema Haider: సీఏఏ అమలుపై సీమా హైదర్ రియాక్షన్.. ప్రధానిపై ప్రశంసలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన ఫర్నీచర్, ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశామని.. ONGC సంస్థ యొక్క సౌజన్యంతో ముషీరాబాద్ మరియు గట్కేసర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 3.5 కోట్లతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తాను పుట్టిన ఘట్కేసర్ తో పాటు..పెరిగిన అశోక్ నగర్ అభివృద్ధిలో తన వంతు కర్తవ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల సౌజన్యంతో ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. గతంలో రెండు సార్లు ముషీరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పని చేశానని అన్నారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నపటికీ పుట్టిన ప్రాంతం, పెరిగిన ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఈ అభివృద్ధిలో పాలుపంచుకున్నానని అన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధి నీ ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో దేశం విశ్వాగురువుగా మారుతుందన్నారు. రోడ్లు, భవనాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వం తరుపున ఆసుపత్రులు, AIMS లాంటి సంస్థలు తెలంగాణాకు ప్రధాని మోడీ అంగించారన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని కూడా సాధ్యం చేసిన చూపించారు మన మోడీ తెలిపారు.

Read also: KTR: కరీంనగర్ సభకు నేను రాలేను.. కారణం చెప్పిన కేటీఆర్

ముఖ్యంగా 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ లాంటి చట్టాలు రద్దు చేశాడన్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాడన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణము చేసిన ఘనత మన ప్రధాని మోడీది అన్నారు. ప్రజల మనోగతానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల మన్ననలు చురగోనాలనే సిద్ధాంతంతో మరిన్ని సేవలు భవిష్యత్తులో కొనసాగిస్తామన్నారు. ప్రజా జీవితంలో నేను ఈ సేవలు చేయడానికి నా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని శుభ పరిణామంగా భావిస్తూ ముందుకు వెళ్తానన్నారు. ముషీరాబాద్ పరిధిలో మొత్తం ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు కూడా టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత చాలా ఉందన్నాఉ. గత వారంలో కొన్ని పాఠశాలల్లో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చేయాలని నా విజ్ఞప్తి అన్నారు.
Gunfire : ప్రియురాలితో, గన్‎తో జోక్స్ వద్దు.. పేలితే ఇలా ప్రాణం పోద్ది