Site icon NTV Telugu

MLC Kavitha: పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు..?

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు..? అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మండలిలో కవిత మాట్లాడుతూ.. మండలి పై ప్రైవేట్ ఛానల్ లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలన్నారు. ఈ ప్రభుత్వ బడ్జెట్ ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఉందని అన్నారు. ఆరు గ్యారంటీలకు సంభందించిన పది శాతం కూడా బడ్జెట్ లో కేటాయించడం లేదని తెలిపారు. ప్రజావాణి వినడం లేదు ఢిల్లీ వాణి వింటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తే తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయన్నారు. తెలంగాణా ఎఐసిసికి ఏటీఎమ్ గా మారిపోయిందని మండిపడ్డారు.

Read also: Telangana Assembly: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులతో కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదం

సోషల్ వెల్ఫేర్ కు మంత్రి లేరని అన్నారు. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 1.39 లక్షల మంది మహిళలకు 2,500ల మందికి ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు లక్ష, తులం బంగారం ఊసే లేదన్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్ లపై స్పష్టత లేదు… ఎప్పుడు అమలు చేస్తారు? అని అన్నారు. గృహజ్యోతి ప్రారంభిస్తాం అంటున్నారు…దాని ఊసే లేదని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పథకానికి కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. పాత పెన్షన్ ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు..? అని మండిపడ్డారు. రేపు సేవలాల్ జయంతికి సెలవు ప్రకటించాలని డిమాండ్ చేసారు. కేసీఆర్ కొన్న బస్సులకు జెండాలు ఊపుడు, కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు సర్టిఫికేట్లు ఇస్తున్నారని ఆరోపించారు.

Read also: Emraan Hashmi : సౌత్ ఫిల్మ్ మేకర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్ హష్మీ..

మరోవైపు మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కవితకు కౌంటర్ ఇచ్చారు. ఎఐసీసీకి పెట్టిన ఖర్చు ప్రభుత్వ ఖర్చు కాదు, పార్టీ ఖర్చు మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మహారాష్ట్ర, పంజాబ్ రైతులకు నిధులు ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి వినియోగించిన బస్సునే రాహుల్ యాత్రకు అప్పగించారని సీతక్క తెలిపారు.
Fastest Runner: వీడెవడ్రా బాబు.. వికెట్ల మధ్య ఇంత వేగంగా పరుగెడుతున్నాడు! ధోనీకి కూడా సాధ్యం కాదు

Exit mobile version