MLA Rajasingh: డబల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు పై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డబల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ నేతలు బీజేపీనీ విమర్శిస్తూ మాట్లాడుతుండడంతో రాజా సింగ్ సభను బహిష్కరించి కిందకు దిగి వెళ్లిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇల్లు ఉన్న వారికే డబల్ బెడ్ రూం ఇల్లు ఇస్తున్నారని మండిపడ్డారు. నా నియోజకవర్గంలో 500 మందికి డబల్ బెడ్ రూం కేటాయిస్తే అందులో 280 మంది వరకు ఇల్లు ఉన్నవారే అని తెలిపారు. 18 వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేటాయించింది 500 మందికి మాత్రమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Hari Hara Veera Mallu: ఆగిపోలేదు… అలా అని అవ్వట్లేదు
ఆ విషయము చెప్పేందుకు కేసీఆర్ మీకు సిగ్గు ఎందుకు ? అని ప్రశ్నించారు. మీ జేబులో నుండి ఇస్తున్నారా? మీ పార్టీ ఫండ్ నుండి ఇస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రెండు లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఎన్ని కట్టారు ? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇచ్చే ఇల్లు కూడా ఎన్నికల డ్రామా మాత్రమే! అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ప్రమేయం ఎందుకు లేకుండా చేశారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మీ వాళ్లకు ఇచ్చుకునెందుకేనా అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. మోడీ ప్రభుత్వం బంగారు తెలంగాణ కావాలని భావిస్తుంటే.. కేసీఆర్ మాత్రం మత్తు తెలంగాణగా మారుస్తున్నారని మండిపడ్డారు.
Cyber Frauds: ట్రాఫిక్ చలాన్ల పేరుతో మోసాలు.. జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు