Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah: ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం కునూర్ లో రాజయ్య మాట్లాడుతూ.. కడియం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కుటుంబం శాస్వత రాజకీయ సమాధి కాబోతుందని అన్నారు. ఆ సమాధికి ప్రజలు రాళ్ళు తయారు చేస్తున్నారని తెలిపారు. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, దళిత ద్రోహి, నకిలీ దళితుడు అంటూ పేర్కొన్నారు. తన బిడ్డకు టికెట్ కోసం ఊసరవెల్లి లా రంగులు మార్చారన్నారు. అభివృద్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళిన అని చెప్పడానికి సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీఆర్ఎస్ లో పది, పది యేండ్ల మంత్రిగా పనిచేసి ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నించారు.
Read also: Karumuri Nageswara Rao: ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ఎన్టీఆర్ కు, చంద్ర బాబు కి వెన్నుపోటు పొడిచిన మూర్ఖుడివి అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చావో చెప్పాలి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లోకి రాగానే నా పదవులకు ఎసరు పెట్టావని మండిపడ్డారు. రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిగ్రీ కళాశాల తేలేదన్నారు. స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి పనులకు ఆడ్డుపుల్ల వేసిన ద్రోహివి అన్నారు. స్టేషన్ ఘనపూర్ కి కడియం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మంత్రి పదవి కోసం, బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్ లోకి పొయినావన్నారు. జీవీఆర్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర రెడ్డి వద్ద 6 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గానికి కడియం మార్క్ ఒక్కటి చూపించండి? అని ప్రశ్నించారు. బినామీ అడ్రస్ లతో ఆస్తులు సంపాదించింది కడియం అన్నారు. నువ్వు ఎక్కడ పుట్టవో నీ తల్లినీ అడుగు చెప్పుతుంది..దానికి సాక్ష్యం మంత్రి దయాకర్ రావే అన్నారు. కడియం కు మిండడు అంటే రాజయ్యే అని అందరూ అంటారని తెలిపారు. కడియం కులం పై సిట్టింగ్ జడ్జితో రేవంత్ విచారణ జరిపించాలన్నారు.
Read also: Bandi Sanjay: పొన్నం వ్యవహారంతో కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారు
మాదిగల వ్యతిరేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. డబ్బులకు అమ్ముడుపోయేవారు మాత్రమే కడియం వెంట ఉంటారు. ఎన్కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియంది అన్నారు. నేతి బీరకల్లో ఎంత నేతి ఉంటాదో..కడియం నీతిలో అంతే నితి ఉంటదన్నారు. కడియం కావ్యను అడుగుతున్న.. నీ తండ్రి, పెద్ద తండ్రిల డీఎన్ఏ లు పరీక్ష చేయించు అని అన్నారు. మతం ఒక మోసం, కులం మరో మోసమన్నారు. అబద్దాల పుట్ట మీద కడియం జీవిస్తున్నారని తెలిపారు. నైతిక విలువ ఉంటే , దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి రా చూసుకుందాం అని సవాల్ విసిరారు. ఎన్నికలప్పుడు వచ్చిన సవాల్..రాజీనామా చేసి మాత్రమే ఏ ఊరికి ఐనా రావాలన్నారు. లేకపోతే మాదిగలు తిరగబడతారన్నారు. 94 లో డొక్కు స్కూటర్, తెగిన చెప్పులతో వచ్చిండు.. ఎమ్మెల్యే కాక ముందు నీ అస్తూలెంత, ఇప్పుడు నీ అస్తులెంతో చెప్పాలన్నారు. విదేశాల్లో బిడ్డా,అల్లుడు హవాల ద్వారా ఆస్తులు కొనడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
T20 World Cup 2024: జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లకు చోటు!
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!