Bandi Sanjay: పొన్నం వ్యవహారంతో కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: పొన్నం వ్యవహార శైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారని కరీంనగర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్మదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో బండి సంజయ్ మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనించారన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారని తెలిపారు. అందుకే 6 గ్యారంటీలపై అడిగితే మాట్లాడలేనని సీఎం చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారుతోందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెల్వదన్నారు. రైతులు, నిరుద్యోగులతో సహా ప్రజలు అల్లాడుతుంటే కనీసం స్పందించని నేత వినోద్ కుమార్ అంటూ మండిపడ్డారు. నాపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పొన్నం ప్రభాకర్ నా గురించి అవాకులు పేలుతుండటం సిగ్గు చేటన్నారు.
Read also: Dulam Nageswara Rao: కైకలూరు వైసీపీలోకి భారీగా చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన దూలం
Also Read
పొన్నం వ్యవహార శైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో అనేక బాధలు ఎదుర్కొంటున్నది మాదిగలే అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు బలిదానమయ్యారని తెలిపారు. మాదిగ సమాజంపై అవాకులు పేలుతున్న మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీలను కించపరుస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పేదలపైన, దళిత, గిరిజన, బీసీ, అగ్రవర్ణాల పేదల గురించి అవాకులు పేలితే సహించేది లేదన్నారు. ఈనెల 8న వేములవాడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకు వస్తున్నారని తెలిపారు. వేములాడలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Rohit Sharma Birthday: రో.. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి: రితికా సజ్దే
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!