Site icon NTV Telugu

MLA Raja Singh: బీజేపీ టికెట్ రాకుంటే.. రాజకీయాలు పక్కన పెట్టి ఆ పని చేస్తా..!

Mla Rajasingh1

Mla Rajasingh1

MLA Raja Singh: బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే..రాజకీయాలు పక్కన పెట్టి హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్ళనని క్లారిటీ ఇచ్చారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోనని అన్నారు. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలనేదే తన లక్ష్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయలు పక్కన పెట్టి నేను హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటా అని అన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారని తీవ్రంగా మండిపడ్డారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని అన్నారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ..ఇండిపెండెంట్ గా కానీ వేరే పార్టీల నుంచి పోటీ చేయనని అన్నారు. బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది.. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

త్వరలోనే తమ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తుందని (మే 16 2023)న బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే… రాజాసింగ్ పై సస్పెన్షన్‌ ఉపసంహరణ ప్రక్రియపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా పార్టీయే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సస్పెన్షన్‌ ఉపసంహరణ సభలో తాను కూడా పాల్గొంటానని, ఈ విషయమై అన్ని విధాలుగా ఆలోచించి హైకమాండ్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజాసింగ్ పై సస్పెన్షన్‌ బీజేపీ అధిష్టానం అసలు ఆలోచించలేదు. దీంతో రాజాసింగ్ ఇవాళ పార్టీ టికెట్ ఇవ్వకపోతే.. రాజకీయాలు పక్కన పెట్టి హిందు రాష్ట్రం కోసం పని చేసుకుంటా అని చెప్పడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

Read also: Mancherial Hospital: మంచిర్యాలలో దారుణం.. పొట్టలో దూదిపెట్టి కుట్లు వేసిన డాక్టర్లు

గత ఏడాది (ఆగస్టు-22)లో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆయనను సస్పెండ్ చేసింది. రాజా సింగ్‌ను ఎందుకు బహిష్కరించకూడదో వివరించాలని బీజేపీ కోరింది. నగరంలోని ప్రముఖ మునావర్ ఫరూఖీ షో సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రవక్త ముహమ్మద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు నగర పరిధిలోని పలు స్టేషన్లలో ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజాసింగ్ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆందోళనకారులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేశారు.

మరోవైపు తెలంగాణ బీజేపీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే రాజా సింగ్ బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల వస్తున్న వదంతులపై రాజాసింగ్‌ క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నుండే గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నా మెంటాలిటీ కి బీజేపీ తప్ప ఏ పార్టీ లు షూట్ కావు… ఎవరు తీసుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్ళలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు నా వెనుక ఉన్నారని రాజాసింగ్‌ తెలిపారు.
Mahabubabad SP: మహబూబాబాద్‌ ఎస్పీ సడెన్ ట్రాన్స్‌ఫర్.. బదిలీలో రాజకీయ కోణమా..?

Exit mobile version