NTV Telugu Site icon

K. Laxman: తుక్కుగూడ లో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైంది..

K Laksxman

K Laksxman

K. Laxman: తుక్కుగూడ లో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైందని ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా తెలంగాణ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హాజరై డైరీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తుక్కుగుడ మీటింగ్ లో కాంగ్రెస్ పంచ న్యాయాల పేరుతో ప్రజలను వంచించడానికి పంగనామాలు పెట్టడానికి తెర లేపారని తెలిపారు. తెలంగాణలో ఇస్తామన్న 2500 రూపాయలకు దిక్కులేదన్నారు. కానీ.. దేశ వ్యాప్తంగా మహిళలకు లక్ష ఇస్తామని ప్రకటిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీ లకి దిక్కు లేదు కానీ మరోసారి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.

Read also: Kakarla Suresh: కాకర్ల సురేష్ గెలుపు కోసం తమ్ముడు ప్రచారం..

తుక్కుగూడ లో కాంగ్రెస్ భహిరంగ సభ విఫలమైందన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో..కాంగ్రెస్ పార్టీ లో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటదన్నారు. అంబేద్కర్ ని ఓడించడానికి కుట్ర పన్నిన కాంగ్రెస్ ఇప్పుడు అంబెడ్కర్ పేరు వాడుకుంటుందన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ ఫోటో కూడా ఉండదన్నారు. ఓ.బి.సీ కి చెందిన రైతు నాయకుడు చరణ్ సింగ్ కి మోది ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించిందన్నారు. కాంగ్రెస్ పీవీ నరసింహారావు ని కూడా అవమానించిందని తెలిపారు. కానీ మోడీ ప్రభుత్వం పీవీ నరసింహారావు కు భారత రత్న ఇచ్చి గౌరవించిందని తెలిపారు.

Read also: Manipur on Mute: మూగబోయిన మణిపూర్.. కనిపించని ఎన్నికల హడావుడి

ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు మోది ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వారి గౌరవాన్ని పెంచిందని అన్నారు. కానీ బీసీ లను కించపరిచే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడని తెలిపారు. చాయ్ అమ్మిన ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉంటే కాంగ్రెస్ ఓర్చుకోడం లేదన్నారు. విశ్వ కర్మ పధకం ద్వారా కులవృత్తుల వారికి చేయూతనిచింది మోడీ ప్రభుత్వం అన్నారు. ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేయడానికి మోది ముందుకు వస్తే కాంగ్రెస్ ఓడించడానికి చూసిందన్నారు. బీసీలకు బద్ధ శత్రువు కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీసీలందరూ కలిసి మరో సారి మోది నీ గెలిపించి కాంగ్రెస్ కి బుద్ది చెబుదామన్నారు.
Manjummel Boys Telugu: తెలుగులో రికార్డు నెలకొల్పిన మలయాళ చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’!