చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ లు చేస్తున్న ఫోటోలను, వీడియోలను చూసే ఉంటారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుల్లో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది.

ఐస్ బాత్ ని క్రయోథెరపీ అని కూడా అంటారు. 

ఐస్ బాత్ చేయడం వల్ల కండరాల పునరుద్ధరణ వేగవంతం అవుతుంది. అలాగే కండరాల గాయాలయ్యే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. 

భారీ వ్యాయామాలు లేదా శారీరక శ్రమ చేసిన తర్వాత ఐస్ బాత్ చేస్తే శరీర మంట,  కండరాల నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 

ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని, కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి సహాయపడుతుంది.

ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

ఐస్ బాత్ వల్ల మీరు మంచి విశ్రాంతి, ఆందోళన లక్షణాలను తగ్గుతాయి.

ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. 

ఆహారంతో పాటుగా ఐస్ బాత్ కూడా మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 ఐస్ - చల్లని ఉష్ణోగ్రతలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడమే కాకుండా.. మంట,చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.